
ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో వర్షాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, రైతులు వరి సాగును కొంత తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని మిర్యాలగూడ వ్యవసాయశాఖ మండల అధికారి ఎం.ఋష్యెంద్రమణి సూచించారు. ఊట్లపల్లి రైతువేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు రైతులకు దిశానిర్దేశం చేశారు.



















