
లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటాలు చేపట్టాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఎఐఎల్ఆర్ఎస్ఎ) సౌత్ కోస్ట్ రైల్వే ప్రథమ జోనల్ మహాసభ పిలుపునిచ్చింది. విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ మహాసభలో పలు కీలక తీర్మానాలు చేశారు.



















