
మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వచ్చే నెల 19 నుంచి జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత అథ్లెట్ల బృందానికి కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది. మొత్తం 492 మంది క్రీడాకారులతో కూడిన జాబితాను ఖరారు చేశారు.

దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడితో 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్పీజీ పైప్ లైన్ నెట్వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ గేల్ ఇండియా నిర్మించనుంది.

స్త్రీల మైత్రి సంఘం

ఆంగ్ల భాషలో పీహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ యు. రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల, బైంసాను ఆదివారం ఎస్టీయూ () టీఎస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మెండోరా మండలం పరిధిలోని దూదిగాం సిఎస్ఐ చర్చిని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ సిఎస్ఐ చర్చి సంఘ స్త్రీల మైత్రి సమాజం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు చర్చి ప్రాంగణంలో ఉన్న పాఠశాల, వైద్యశాలలను కూడా సందర్శించి, దూదిగాం గ్రామం తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీహెచ్‌సీకి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రహదారి పొడవునా ఏర్పడిన గుంతలు, వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. దీంతో రోగులు, వారి సహాయకులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉచిత బ్యూటిషియన్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మేనేజర్ రేఖల మమత పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరంగా పరిణమించిందని మాల కోఆర్డినేషన్ ఫోరం (ఎంసీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. రోస్టర్ పాయింట్‌ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో ఎంసీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇకపై రాజకీయ నాయకులు, అక్రమాలకు పాల్పడేవారు కావాలని కక్ష్యతో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసే వారిపై ఈ కేసులు వర్తించవని తెలిపింది.

శివాలయంలో సహస్ర ఘటాభిషేకం..

మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామంలో ఆదివారం బోనాల మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

ఎస్ఐఆర్ రెండో విడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో జరిగిన అసెంబ్లీ కార్యాశాలలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తానూరు మండలంలోని ఉమ్రి గ్రామంలో సాహిత్య సామ్రాట్ అన్న బాహు సాటే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, అన్న బాహు సాటే గారి సేవలను కొనియాడారు.

చిట్యాల మండలంలో ఇటీవల జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తీవ్రంగా ఖండిస్తూ, పుల్ల రవీందర్‌కు అండగా నిలుస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తోందని టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నిర్మల్ జిల్లా ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డా. జగన్నాథం కార్డియాక్ సెంటర్ ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శివాలయంలో సహస్ర ఘటాభిషేకం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దానయ్య (30) మృతిచెందినట్లు సమాచారం.

మలఆగసట23మోజిెలగటైమసగమచెదలచలషమణఅోగయోబధెలసబధపిశససయలశీజ.ఠలె,జి.మజీషయఉమమఆగసటదలబదజలలఇచజమశీజలలృషణదృషటీసెళల.మచొోఫసమ.సమలషలలైమజచేయబద.

తానూరు మండల కేంద్రంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు టెండర్ అప్రూవల్ కాపీని మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి గౌరవ ముదిరాజ్ కుల సంఘం సోదరులకు అందజేశారు.