మిర్యాలగూడ పట్టణంలో శనివారం మిర్యాలగూడ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఏ సమస్య ఉన్నా ఐక్యంగా పరిష్కరించుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు. అందరూ ఒక తాటిపై నడవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.
బిల్డర్స్ సమావేశంలో సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే వారంలోపు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం, బాధ్యతలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ అధినేత ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ సభ్యులు: అధ్యక్షులుగా ఎండి నయీముద్దీన్, ఉపాధ్యక్షులుగా వి. శ్యాంసుందర్, జనరల్ సెక్రటరీగా ఎండి అమీర్ షరీఫ్, జాయింట్ సెక్రటరీగా వి. రమేష్, ట్రెజరీగా ఎం. రఘురాం రెడ్డి, సలహాదారులుగా షేక్ అక్బర్ బాషా, లక్ష్మణ్ ఎన్నికయ్యారు.












