గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులు తమ సబ్సిడీని నిరంతరాయంగా పొందాలంటే, ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తమ సబ్సిడీని నిరంతరాయంగా పొందాలంటే, ప్రతి సంవత్సరం ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే నెలలో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. వినియోగదారులు తమ ఆధార్ వివరాలను గ్యాస్ కనెక్షన్‌తో ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
వినియోగదారుల సౌకర్యార్థం ఆయిల్ కంపెనీలు ఈ-కేవైసీని పూర్తి చేయడానికి మూడు రకాల పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) పద్ధతిలో కేవైసీని పూర్తి చేయవచ్చు. నేరుగా గ్యాస్ డీలర్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు (Biometric) వేయడం ద్వారా లేదా సిలిండర్ డెలివరీ ఇచ్చే సమయంలో సిబ్బంది వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
పూర్తి వివరాల కోసం http://www.pmuy.gov.in/e-kyc.html వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు ఎటువంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, సబ్సిడీ పొందే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా కేవైసీ పూర్తి చేయకపోతే, మార్చి లేదా మే నెల తర్వాత వచ్చే సబ్సిడీ జమ కాకపోవచ్చని స్పష్టం చేశారు.












