ఆర్మూర్, జూలై 13
ఆర్మూర్పట్టణంలోఇటీవలజరిగినపట్టుచేనేతసహకారసంఘంఎన్నికల్లో9మందిడైరెక్టర్లుసోమవారంచైర్మన్,వైస్‌చైర్మన్,కార్యదర్ి,కోాధికారిపదవులకుఏకగ్రీవంగాఎన్నికయ్యారు.బోచ్కర్కోలుగంగమోహన్చక్రుఅధ్యక్షుడిగా,ికారి్రీనివాస్ఉపాధ్యక్షుడిగా షికారిశ్రీనివాస్ శ్రీనివాస్ఎన్నికయ్యారు.
ఆర్మూర్ పట్టణంలో ఇటీవల ఎన్నికైన పట్టు చేనేత సహకార సంఘం 9 మంది డైరెక్టర్లతో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి సాయికుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బోచ్ కర్ కోలు గంగ మోహన్ చక్రు, ఉపాధ్యక్షులుగా శికారి శ్రీనివాస్, కార్యదర్శిగా బోచ్ కర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా బదాం రాజ్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బోచ్ కర్ కోలు గంగ మోహన్ చక్రు మాట్లాడుతూ, పట్టు చేనేత సహకార సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, సంఘం సభ్యులకు ప్రభుత్వ పథకాలు, ఐడి కార్డులు కూడా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
గెలుపొందిన డైరెక్టర్లందరినీ పూలమాల, శాలువతో క్షత్రియ ఖత్రి సమాజ్ మాజీ కార్యదర్శి బారడ్ గంగా మోహన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పొహర్ శైలేష్, ఖాందేష్ సత్యం, బచ్చేవాళ్ రెడ్డి శ్రీనివాస్, పడాల్ నరేందర్, పడాల్ గణేష్, మాజీ అధ్యక్షులు పోహార్ మోహన్, కర్తన్ గణేష్యామ్, కౌన్సిలర్ పాన్ శ్రీనివాస్, బారడ్ కిషోర్, పొహార్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.












