మనోరంజని తెలుగు టైమ్స్: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన మూల కిషన్ గౌడ్‌ను మోకుదెబ్బ సంఘం మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ నియామకంపై రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
గత పదేళ్లుగా గౌడ కులస్తులు మరియు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మూల కిషన్ గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ నియామకం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చి, తదుపరి జిల్లా మహాసభలు జరిగే వరకు కొనసాగుతుందని తెలియజేయబడింది. ఈ నియామకం ద్వారా సంఘం కార్యకలాపాలు మరింత విస్తృతం అవుతాయని భావిస్తున్నారు.
ఈ నియామక ప్రక్రియలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండి గౌడ్, రాష్ట్ర నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్, మూల లచ్చన్న గౌడ్ వంటి పలువురు పాల్గొన్నారు.


