Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
మామడ మండలంలోని దిమ్మదుర్తి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మామడ మండలంలోని దిమ్మదుర్తి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ మండలం కౌట్ల కె గ్రామానికి చెందిన వీరేష్ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి రోడ్డుపై పడింది. అతడిని పైకి లేపేందుకు వెనకాల వస్తున్న కారు ఆపిన క్రమంలో, వెనకాల వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మామడ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన గంగారాం తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీ నడిపిన వీరేష్ కు ముఖానికి గాయాలయ్యాయి. వీరికి 108 సిబ్బంది పైలట్ సురేష్, విజయ్ ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












