మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ ముక్కాల లక్ష్మి కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద బ్యాక్వాటర్లో సరదాగా నీటిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ ముక్కాల లక్ష్మి కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద బ్యాక్వాటర్లో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు సరదా కోసం ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటిలోకి దిగగా, ఈ దుర్ఘటన జరిగింది. వారిలో ఐదుగురు నీటిలో గల్లంతవగా, ఒకరిని స్థానికులు రక్షించారు.
గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాల్కొండ సీఐ జానారెడ్డి, ముక్కల్ ఎస్సై కిరణ్ కుమార్, మండల ఎస్సై జాదవ్ సువాసిని ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.












