(బి) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధుడు ఎం. ఎర్రన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎడమ కాలు విరిగింది. ప్రమాదానికి గురైన వృద్ధుడిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోని కౌట్ల (బి) గ్రామంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని సాయిబాబా గుడి వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఎం. ఎర్రన్న (60) అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఆయన ఎడమ కాలు విరిగిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. సారంగాపూర్ 108 అంబులెన్స్ ఈఎంటి ప్రభాకర్, పైలట్ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎర్రన్నకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.












