29-06-2026 (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 29
29 జూన్ 2026, సోమవారం నాడు మేషం నుండి మీనం వరకు రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు మేష రాశి వారికి ఆప్తుల నుండి ధన సహకారం అందుతుంది, పాత ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. మిధున రాశి వారికి ఋణ ఒత్తిడి అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి.
మేషం: ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభం: చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మిధునం: ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కర్కాటకం: మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
సింహం: ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
తుల: ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.












