హైదరాబాద్, 2026-06-05
ప్రపంచ వాతావరణ సంస్థ () కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారాల్లో సూపర్ ఎల్ నినో ప్రభావం మరింత బలపడే అవకాశముందని, ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ () కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారాల్లో సూపర్ ఎల్ నినో ప్రభావం మరింత బలపడే అవకాశముందని, ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
భారత్‌పై ప్రభావం
భారత్‌లో ఈ రుతుపవన కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య ప్రాంతాల్లో తేమ కొరత ఏర్పడి కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా అస్సాం ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల ముప్పు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్త పరిణామాలు
ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఐరోపాలో పలు దేశాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించగా, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అడవి మంటలు, కరువు పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
ఐరాస కార్యదర్శి హెచ్చరిక
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ, ఎల్ నినో మన గుమ్మం వద్ద కాదు... మన ఇంట్లోకి వచ్చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు.
నిపుణుల సూచన
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.












