ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. ఈ అరుదైన ఖగోళ దృగ్విషయం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో ప్రకాశవంతంగా కనిపించింది.
భారతదేశంతో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియా వంటి దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా వీక్షించబడింది. గ్రహణం సమయంలో చందమామ ఎరుపు రంగులోకి మారడాన్ని 'బ్లడ్‌మూన్'గా అభివర్ణిస్తారు.
ఈ దృగ్విషయం చంద్రునిపై పడే భూమి నీడలోని కాంతి వక్రీభవనం వల్ల సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.
రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించడానికి ఆసక్తి చూపారు.


