ఖానాపూర్, జూలై 30
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీనివాస్, ఎంపీడీవో రాధా రాథోడ్ మండలంలోని సుర్జాపూర్, దిలావర్పూర్ గ్రామాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పరిస్థితులను పరిశీలించిన అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీనివాస్, ఎంపీడీవో రాధా రాథోడ్ మండలంలోని సుర్జాపూర్, దిలావర్పూర్ గ్రామాలను గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో పరిస్థితులను పరిశీలించిన అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో ఎవరూ నివసించవద్దని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, బావులు, నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మేడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సదరమాట్ ప్రాంతాన్ని ఎంపీడీవో రాధా రాథోడ్ సందర్శించారు. భారీ వర్షాల కారణంగా ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
ఈ పర్యటనలో డీపీఓ శ్రీనివాస్, ఎంపీడీవో రాధా రాథోడ్, సర్పంచ్ చింతల మల్లేష్, ఉపసర్పంచ్ ఓరుగంటి రాజేశ్వర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.












