Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని, పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని పేర్కొంటూ పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని సూచించారు. వర్షాల కారణంగా మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలు కనిపించకుండా ఉండే అవకాశం ఉన్నందున నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు దాటేందుకు ప్రయత్నించవద్దని, వ్యవసాయ పొలాలు, పొదలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో విషసర్పాలు సంచరించే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అలాగే పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఉరుములు, మెరుపులు, భారీ వర్షం సమయంలో చెట్ల కింద లేదా రోడ్లపై నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ భద్రతా సూచనలు తెలియజేయాలని కూచాడి శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు.












