లోకేశ్వరం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ ప్రదీప్ ఆదివారం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మోడం శంకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రదీప్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలపై హెచ్చరిక
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఎస్ఐ ప్రదీప్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు సూచన
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్ఐ ప్రదీప్ సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొని నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.












