ఖానాపూర్, 30 July
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మందపల్లి–సత్తెనపల్లి ప్రధాన రహదారి మధ్యలో భారీ చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత–రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మందపల్లి–సత్తెనపల్లి ప్రధాన రహదారి మధ్యలో భారీ చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే మందపల్లి సర్పంచ్ బైరెడ్డి రజిత–రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వారి ఆధ్వర్యంలో చెట్లను తొలగించి, రహదారిని తిరిగి ప్రయాణానికి అనుకూలంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సహాయక చర్యల్లో సత్తెనపల్లి అటవీ శాఖ అధికారులు, అడిసారంగాపూర్ యువకులు, అలాగే మందపల్లి గ్రామ యువకులు స్వచ్ఛందంగా పాల్గొని చెట్లను తొలగించడంలో విశేషంగా సహకరించారు.
స్థానికుల సహకారంతో రహదారిని త్వరితగతిన శుభ్రం చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు సర్పంచ్, అటవీ శాఖ అధికారులు మరియు యువకుల సేవలను అభినందించారు.











