లోకేశ్వరం మండలం ఆగస్టు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): స్థానిక పోలీస్‌స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ ప్రదీప్‌ను ఆదివారం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మోడం శంకర్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రదీప్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలపై ఎస్ఐ హెచ్చరిక
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, మద్యం లేదా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు సూచనలు
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొని నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.











