శ్రీహరికోట (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
భారత అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ప్రైవేట్ రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కొత్త మార్గం సుగమం చేసింది.
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయానికి అడుగు పడింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్, మొత్తం 4 దశలను విజయవంతంగా ఛేదిస్తూ లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది.
ఈ రాకెట్ 350 కేజీల పేలోడ్స్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంతో ప్రైవేట్ స్పేస్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.











