ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గాఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరణ
👉 హాజరైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ ప్రకాష్
మిర్యాలగూడ ఆగస్టు 13 (మనోరంజని తెలుగు టైమ్స్)
ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలునుసమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. గురువారం తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ గా కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జరిగిన 2026–27 ప్రాథమిక సమావేశంలో చైర్మన్గా శంకర్ నాయక్ సమావేశంలో హాజరై కమిటీ కార్యకలాపాలపై చర్చించారు.ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కమిటీ సభ్యులు భాను ప్రసాద్, రవీందర్ మధుసూదన్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులునరసింహాచారి, తిరుపతి లు బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ కుశుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.












