మిర్యాలగూడ, 2026-08-14
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఫ్లై ఓవర్ నుండి రౌండ్ వరకు పట్టణ ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులతో కలిసి ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
దేశ సమగ్రతపై రావు పద్మ స్పందన
కార్యక్రమ ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ మాట్లాడుతూ, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి హాని తలపెట్టాలని లేదా విదేశీ సొమ్ముతో దేశంలో అరాచకం సృష్టించాలని చూసే విచ్ఛిన్న శక్తులు ఎవరైనా సరే, వారికి భారత ప్రభుత్వం, దేశ యువత సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు లక్ష్మీ నరసయ్య, బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, గోలి మధుసూదన్ రెడ్డి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమ జిల్లా ఇన్చార్జ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహా, మిర్యాలగూడ టౌన్ వన్, టూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బంటుగిరి, పెద్దబోయిన వెంకటేశ్వర్లు, కొంగరి వెంకటరమణ, మూల రాజిరెడ్డి, శ్రీకాంత్, సీనియర్ నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, ఎడ్ల రమేష్, తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, కొండేటి సరిత, చిలుకూరి రమాదేవి శ్యామ్, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజ్, చిల్లంచర్ల అభి, బంటు యాదగిరి, గోనె కవితరెడ్డి, మండల సోములు, మంద శివ, మోదల అశోక్, మునగాల శివ, చిలుకూరి వెంకటేశ్వర్లు, శశి పాల్గొన్నారు.












