నిర్మల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల నియామకం శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. చైర్మన్ అప్పాల కావ్య చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నలుగురు కొత్త సభ్యులను ఎంపిక చేశారు.
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మొత్తం 40 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, వీరిలోంచి మైనార్టీ కోటాలో అస్మా బేగం, నోమన్ అలీ, బీసీ వర్గం నుండి మేడారం అపర్ణ, జనరల్ కోటా నుండి గాజుల రవిలను ఎంపిక చేశారు.
ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అనంతరం, నూతన సభ్యులతో మున్సిపల్ కమిషనర్ రవిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా, పట్టణ అభివృద్ధికి నూతన సభ్యులు తమ సూచనలు అందించాలని చైర్మన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి ఆకాంక్షించారు.
ఈ ప్రక్రియలో డి.ఈ. హరి భువన్, మేనేజర్ మారుతీ, మున్సిపల్ కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు. ఈ నియామకాలు పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.












