మంచిర్యాల జిల్లా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో గల భీమారం మండలం, కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఎనిమిదవ వార్డులో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫారాలను నింపారు.
చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు, చెన్నూర్ నియోజకవర్గంలోని భీమారం మండలం, కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక ఓటరు సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR) ప్రక్రియను పూర్తి చేశారు. ఎనిమిదవ వార్డులో ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కలగూర రమేష్, రాజారావు, మహేష్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, ఓటరు సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు.












