తుంకూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 26
కర్ణాటక రాష్ట్రం, తుంకూర్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కల్లంబెల్ల టోల్ వద్దగల శ్రీ శక్తి స్వరూపిణి రేణుకా యల్లమ్మదేవి ఆలయంలో, జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 8వ తరం వంశస్థులు, తత్వ ప్రచారకులు శ్రీశ్రీ వీరభద్ర స్వాములవారి దంపతులకు ఘనంగా సన్మానం చేశారు.
2026 ఆగస్టు 24న కర్ణాటక రాష్ట్రం, తుంకూర్ జిల్లాలోని కాటవీరనహళ్లి, కల్లంబెల్ల టోల్ వద్ద శ్రీ శక్తి స్వరూపిణి రేణుకా యల్లమ్మదేవి ఆలయంలో, డాక్టర్ అనుతల్లి పూర్ణకుంభంతో, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 8వ తరం వంశస్థులు, తత్వ ప్రచారకులు శ్రీశ్రీ వీరభద్ర స్వాములవారి దంపతులను ఆహ్వానించారు.
ఘనంగా పాదపూజ, సన్మానం
అనంతరం, శ్రీ స్వాములవారి దంపతులకు పాదపూజ, గజమాల సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి జీవిత చరిత్ర, కాలజ్ఞాన తత్వాలపై విచ్చేసిన భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ఆశీస్సులను అందించారు.












