నిర్మల్, 2026-06-05
గౌస్ ఏ ఆజాం మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గదర్శకాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు.
గౌస్ ఏ ఆజాం మీలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గదర్శకాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, సమాజ సేవలో యువకులు తమ పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
ర్యాలీ, అన్నదానం
అనంతరం మహమ్మద్ ప్రవక్తను స్మరించుకుంటూ ఆయన నిజ జీవితంలో పాటించిన సూత్రాలు, ఆచరణలపై శ్లోకాలు, గీతాలు ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మౌలాన అన్వర్ పాషా ఖాద్రి, కౌన్సిలర్ షేక్ ఫెరోజ్, మాజీ కౌన్సిలర్ అన్వర్ భాయ్, గౌస్ ఏ ఆజాం మీలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అశ్రార్ ఖాద్రి, ఉపాధ్యక్షులు మొహమ్మద్ లతీఫ్, ప్రధాన కార్యదర్శి ఇసాక్ అలీ ఖాద్రి, సహాయ కార్యదర్శి షేక్ రహ్మత్, కోశాధికారి ఇర్ఫాన్ ఉద్దీన్, జావీద్, మిస్బ రజా, ఆజాం రజా, గౌస్, ముషర్రాఫ్, అవైస్, అయాన్, అక్బర్, సల్మాన్, మిన్హాజ్, సలీం, శారీక్, ఇంతియాజ్, ముజ్తబ, ముబాషీర్, అమిన్ బాబా తదితరులు పాల్గొన్నారు.












