కరీంనగర్ PMJ జ్యూవెలరీ చోరీ కేసును కొత్త డీఎస్పీలకు పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 18న తెలంగాణ పోలీసు అకాడమీలో ప్రత్యేక తరగతి నిర్వహించనున్నారు. కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ అలాం ఈ కేసు వివరాలను ట్రైనీలకు వివరించనున్నారు.
కొత్త డీఎస్పీలకు ఒక కేస్ స్టడీగా కరీంనగర్ PMJ జ్యూవెలరీ కేసును పాఠ్యాంశంలో చేర్చాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన మేరకు, తెలంగాణ పోలీసు అకాడమీలో ఈనెల 18వ తేదీన ట్రైనీ డీఎస్పీలకు ఒక ప్రత్యేక తరగతిని నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ తరగతిలో, కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ అలాం, ట్రైనీ డీఎస్పీలకు PMJ జ్యూవెలరీ కేసు వివరాలను క్షుణ్ణంగా వివరించి, పాఠాలు బోధించనున్నారు. గత మే 3వ తేదీన జరిగిన ఈ పీఎంజే జ్యూవెలరీ చోరీ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.












