Nirmal/Dasturabad (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టులోకి 6,564 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, నీటి మట్టం 683 అడుగులకు చేరింది. త్వరలోనే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 6,564 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 683 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.











