కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఇన్నోవేషన్ డే–ఏఐ కాన్క్లేవ్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఆముదారి ప్రవీణ్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాముఖ్యతపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐ ఉపయోగాలు, విద్యారంగంలో దాని అవసరం, ప్రాధాన్యతను రిసోర్స్ పర్సన్ ప్రవీణ్ వివరించారు.
ఆధునిక సాంకేతికతలో ఏఐ పాత్రను, విద్యార్థుల భవిష్యత్తుకు అది ఎలా దోహదపడుతుందో ప్రవీణ్ తెలియజేశారు. అధ్యాపకులు కూడా ఏఐపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు ఏఐపై సెమినార్, డిబేట్ నిర్వహించారు. విద్యార్థులు ఈ అంశంపై ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి.తుకారాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












