హైదరాబాద్, జులై 17
భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు.
భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్ తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోడీ, శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభించారు. హర్యానాలోని జింద్ - సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు.
ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. ఈ రైలులో ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉంటాయి. దీంతో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది. దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.
ఈ హైడ్రోజన్ రైల్లో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. జింద్- సోనిపత్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మార్గంలో 11 చోట్ల ఆగుతుంది. రోజుకు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లనుంది.
దీనిని స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు లేకుండా నడుస్తుంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే డీజిల్ రైళ్లలా కాకుండా, ఈ హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు.
ఈ రైలును నడపడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్‌ను జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ నుండి సరఫరా చేస్తారు. సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి ఈ ప్రాజెక్ట్‌లో అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.












