నిర్మల్, 24 July
నిర్మల్ పట్టణంలోని బస్తీ దవాఖానాను వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని పాత డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీస్ పక్కన గల బస్తీ దవాఖానాను శుక్రవారం వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పలు రికార్డులను ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.












