మిర్యాలగూడ, జులై 12
టీటీడీ జెఈఓగా ఇటీవల నియామకం అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆడవత్ శరత్ నాయక్ ను బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలోని పలువురు నేతలు మిర్యాలగూడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం 2026 డైరీని ఆయనకు అందజేశారు.
టీటీడీ జెఈఓగా నియామకం అయిన అనంతరం మిర్యాలగూడకు వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ ఆడవత్ శరత్ నాయక్ ను బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నేతలు కలిశారు.
ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం 2026 డైరీని శరత్ కు అందజేశారు.
ఆయన వెంట బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు బిక్కు నాయక్, జైత్రం నాయక్, మహేందర్ నాయక్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.












