✒️ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
సైబర్ మోసాల నెట్వర్క్ వెనుక సూత్రధారిగా వ్యవహరిస్తున్న 18 ఏళ్ల రోహిత్ శాక్యను గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11వ తరగతితో చదువు ఆపేసిన ఈ యువకుడు, కోడింగ్, ఏఐ టెక్నాలజీతో బ్యాంకింగ్, ఆర్టీఓ పేరిట 121 నకిలీ యాప్‌లను తయారు చేశాడు.
సైబర్ మోసాల నెట్వర్క్ వెనుక సూత్రధారిగా ఉన్న 18 ఏళ్ల రోహిత్ శాక్యను గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11వ తరగతిలోనే చదువు ఆపేసిన ఈ యువకుడు కోడింగ్, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకింగ్, ఆర్టీఓ పేరిట 121 నకిలీ యాప్‌లను రూపొందించాడు. ఈ యాప్‌లను సైబర్ నేరగాళ్లకు నెలకు రూ.15 వేల సబ్‌స్క్రిప్షన్‌కు అమ్మేవాడు. ఈ నకిలీ యాప్‌ల ద్వారా మోసగాళ్లు దేశవ్యాప్తంగా 2,928 ఫోన్లను హ్యాక్ చేసి రూ.64.38 కోట్లు కాజేశారు.












