అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో న్యాయం చేయించిన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్‌ను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ యూనియన్ (APJWU) రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల జరిగిన అక్రిడేషన్ కమిటీ సమావేశంలో, ప్రభుత్వ ఉత్తర్వుల (జిఓ) ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనిపై యూనియన్ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
APJWU రాష్ట్ర అధ్యక్షుడు బూసి మునిబాబు, కలెక్టర్‌తో మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రిడేషన్ల విషయంలో న్యాయం జరగాలని కోరారు.











