బోయినిపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శనివారం ప్రారంభించారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వీవో భవనాలు సంఘాల కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వీవో (విలేజ్ ఆర్గనైజేషన్) భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సంఘాల కార్యకలాపాల నిర్వహణకు వీవో భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
వీవో భవన నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ముదుగంటి ప్రతాప్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు రత్నకర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి ఆరు గుంటల భూమిని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రామ సర్పంచ్‌తో కలిసి వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.












