బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 27
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి గేట్లను పరిశీలించి, అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని సూచించారు. వడ్డాడి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.
తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టును శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి గేట్లను పరిశీలించారు. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ప్రాజెక్టు నుంచి వడ్డాడి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ విట్ఠల్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












