హైదరాబాద్, జులై 17
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు, జులై 17న జరగనుంది. ఈ అత్యవసర సమావేశంలో పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపు, రాబోయే అసెంబ్లీ బిల్లులు, నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రేపు, 17వ తేదీన సచివాలయంలో కేబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
రాష్ట్రంలోని పలు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల రీ-ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. రాబోయే అసెంబ్లీ సభలో సరికొత్త 'మున్సిపల్ చట్టాన్ని' ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్లో విస్తృతంగా చర్చించి, దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.











