Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, వారంలోగా 90 శాతానికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం దృశ్య మాధ్యమం ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెనుకబడిన జిల్లాల్లో పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. జిల్లాల వారీగా డిజిటలీకరణ పురోగతిని సమీక్షించి, వీలైనంత త్వరగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ నమోదు పత్రంలో ఆధార్ సంఖ్య నమోదు చేయడం ఐచ్చికమే తప్ప తప్పనిసరి కాదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.