ఖానాపూర్, జూలై 21
రానున్న 2027 పుష్కరాల సందర్భంగా గోదావరి ఒడ్డున ఉన్న బాదం కుర్తి గ్రామానికి పుష్కర ఘాటు నిర్మించాలని కోరుతూ బాదం కుర్తి నాయకులు ఖానాపూర్ శాసనసభ్యులు వేడుమ బోజు పటేల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
రానున్న 2027 పుష్కరాలకు గోదావరి ఒడ్డున ఉన్న బాదం కుర్తి గ్రామానికి పుష్కర ఘాటు నిర్మించాలని బాదం కుర్తి నాయకులు ఖానాపూర్ శాసనసభ్యులు వేడుమ బోజు పటేల్‌ను ఉట్నూర్ క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
పుష్కర్ ఘాటు నిర్మించడం వలన మస్కాపూర్, సుర్జాపూర్, మేడమ్ పల్లి, చింతల్ పేట్, గంగాయిపేట్, మరియు గోదావరి ప్రక్కనగల గ్రామాల భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎలాగైనా సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పార్షపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ మాదాస్తు నవీన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాసుల లక్ష్మీరాజ్యం, వి.డి.సి సభ్యులు మురళి, కమ్మల రాజు, బండి లింగ గౌడ్, మైలారపు ఎల్లయ్యలు పాల్గొన్నారు.











