సారంగాపూర్, జులై 22
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని సాయినగర్ తండాలో రూ. 20 లక్షల ప్రభుత్వ నిధులతో మురికి కాల్వ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాంబ్లే సరిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి హాజరు కాలేదు. వారిద్దరి గైర్హాజరీలోనే గ్రామ నాయకులు పనులను ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని సాయినగర్ తండాలో రూ. 20 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మురికి కాల్వ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సాంబ్లే సరిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రావణి గైర్హాజరీలో గ్రామ నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఉన్నత మండల అధికారులు ఏం చేస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాబ్లే నానక్ సింగ్, దేవిసింగ్, ఝుక్య నాయక్, గణపతి, ధరం సింగ్, రవి ప్రకాశ్, గజేందర్ పాల్గొన్నారు.












