బీబీనగర్, July 22
తానూర్ మండలం ఝరి ‘బి’ గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. పైప్లైన్ లీకేజీల వల్ల శుద్ధి చేసిన నీరు వీధుల్లోకి చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించాల్సిన అధికారులు స్పందించకపోవడంతో గ్రామపంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టారు.
తానూర్ మండలం ఝరి ‘బి’ గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో తాగునీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ లీకేజీలు ఏర్పడి శుద్ధి చేసిన వేలాది లీటర్ల తాగునీరు వీధుల్లోకి చేరుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
గ్రామంలో పలు చోట్ల పైప్లైన్ లీకేజీల కారణంగా నీరు వృథాగా పోవడంతో పాటు వీధుల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా అధికారుల నుంచి సరైన స్పందన లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
అధికారుల స్పందన లేకపోవడంతో గ్రామపంచాయతీ సిబ్బంది ముందుకు వచ్చారు. బుధవారం లీకేజీ ఉన్న ప్రాంతాలను గుర్తించి పంచాయతీ కార్మికులే మరమ్మతు పనులు చేపట్టి నీటి వృథాను అరికట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ జీతాలు పొందుతున్న అధికారులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండగా, గ్రామపంచాయతీ కార్మికులు ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఇకనైనా మిషన్ భగీరథ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పర్యవేక్షణ పెంచాలని ఝరి ‘బి’ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












