నిర్మల్, జూన్ 29
ప్రజల నుంచి అందిన ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించిన కలెక్టర్, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి అందిన ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజల సమస్యలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజావాణిలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి తమ దరఖాస్తులను కలెక్టర్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












