కుబీర్, 1 August
కుబీర్ మండలం పల్సి గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంపై సమగ్ర వివరాలు కోరుతూ స్థానిక గజ్జిరాం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 కింద మండల పంచాయతీ రాజ్ కార్యాలయం ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. 2024-2026 మధ్యకాలంలో వివిధ ఆర్థిక సంఘాలు, గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులు, వాటి ఖర్చులకు సంబంధించిన అన్ని రికార్డులను ఆయన కోరారు.
కుబీర్ మండలం పల్సి గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై పూర్తి వివరాలు కోరుతూ గ్రామానికి చెందిన గజ్జిరాం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 కింద మండల పంచాయతీ రాజ్ కార్యాలయం ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు సమర్పించారు.
2024 జనవరి 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, ఎంజీఎన్ఆర్ఈజీఎస్తో పాటు ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధుల వివరాలు, వాటి ఖర్చులకు సంబంధించిన బిల్లులు, వోచర్లు, మెజర్మెంట్ బుక్ (ఎంబీ), పరిపాలనా, సాంకేతిక అనుమతులు, అంచనాలు, వర్క్ ఆర్డర్లు, కంప్లీషన్ సర్టిఫికెట్లు, నగదు పుస్తకం, బ్యాంక్ స్టేట్మెంట్లు, గ్రామసభ తీర్మానాలు, చెల్లింపులు పొందిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, 2024–2026 కాలానికి సంబంధించిన ఆడిట్ నివేదికలు, అభ్యంతరాల ధృవీకరించిన ప్రతులు అందించాలని కోరారు.
చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలని దరఖాస్తులో విజ్ఞప్తి చేశారు.












