నిర్మల్, జులై 21
నిర్మల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు రవి బాబు, సుందర్ సింగ్, యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












