మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్రలో రోడ్డు ప్రమాదంలో వనపర్తికి చెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్వస్థలానికి తీసుకురావడం, మృతదేహాన్ని తరలించడం, ఆర్థిక భారం తగ్గించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించి రూ.1.15 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సోమవారం రోడ్డు ప్రమాదంలో వనపర్తి పట్టణానికి చెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వనపర్తికి చెందిన బాధితులను స్వస్థలానికి తీసుకురావడం, మృతదేహాన్ని వనపర్తికి తరలించడం, బాధిత కుటుంబాలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించారు. మానవత్వం చాటుతూ, ఆయన ప్రమాద బాధితులకు అండగా నిలిచారు.
బాధితుల రవాణా, చికిత్స, మృతదేహం తరలింపు తదితర అత్యవసర ఖర్చుల కోసం మొత్తం రూ.1.15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి అందించిన సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యే స్పందనను అభినందించారు.












