Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఈ వివరాలను వెల్లడించారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
మధ్యాహ్నం 12:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం, మంత్రులు రోడ్డు మార్గంలో కడెం ప్రాజెక్టుకు బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 1:35 గంటలకు కడెం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటి నిల్వలు, వరద నిర్వహణ, భద్రతా చర్యలు, అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
మంత్రుల పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.












