లోకేశ్వరం, 21 July
లోకేశ్వరం మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్సై)గా ప్రదీప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై అశోక్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో ప్రదీప్ ఈ బాధ్యతలను చేపట్టారు.
లోకేశ్వరం మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్సై)గా ప్రదీప్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై అశోక్ బదిలీ కావడంతో, ఆయన స్థానంలో ప్రదీప్ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తామని తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.












