Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
లోకేశ్వరం పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
లోకేశ్వరం మండలం పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సైకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లోకేశ్వరం సర్పంచ్ ధార్వాడి కపిల్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరిపిశాం సుందర్, అమెరికిడ్స్ ఇన్ స్కాలర్స్ విద్యాసంస్థల చైర్మన్ అజయ్ రావు, రామారావు, లక్ష్మణరావు, సవీన్, అరుణ్ తదితరులు పాల్గొని నూతన ఎస్సైని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమం అనంతరం ఎస్సై అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.












