ఖానాపూర్, జూలై 21
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజుర సత్యం ఆధ్వర్యంలో మంగళవారం పారిశుద్ధ్య, అభివృద్ధి పనులు చేపట్టారు. వార్డులో పర్యటించి, పిచ్చి మొక్కలు, పొదలను తొలగించారు. దెబ్బతిన్న సీసీ రోడ్లు, కూలిపోయిన మురికి కాలువల వద్ద గుంతలను మొరం మట్టితో పూడ్చి చదును చేయించారు.
ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజుర సత్యం ఆధ్వర్యంలో మంగళవారం పారిశుద్ధ్య, అభివృద్ధి పనులు చేపట్టారు. వార్డులో పర్యటించిన కౌన్సిలర్ పిచ్చి మొక్కలు, పొదలను తొలగింపజేశారు. అలాగే దెబ్బతిన్న సీసీ రోడ్లు, కూలిపోయిన మురికి కాలువల కారణంగా ఏర్పడిన గుంతలను మొరం మట్టితో పూడ్చి చదును చేయించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మరమ్మతు పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.












