కడం (పెద్దూర్), 2026-07-30
నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు గేట్లు తెరిచి నీటి విడుదలను పెంచారు. గురువారం మధ్యాహ్నం 2:50 గంటలకు గేట్లు నెం.2, 3లను 15 అడుగుల వరకు ఎత్తారు. ప్రస్తుతం 16 గేట్ల ద్వారా 1,65,629 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు నీటి విడుదలను పెంచారు. గురువారం మధ్యాహ్నం 2:50 గంటలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లు నెం.2, 3లను 15 అడుగుల వరకు ఎత్తారు. ప్రస్తుతం 18 గేట్లలో 16 గేట్లు తెరిచి ఉంచి, 1,65,629 క్యూసెక్కుల సర్ప్లస్ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు నీటిమట్టం 693.500 అడుగుల వద్ద కొనసాగుతోంది. భారీగా వరద నీరు విడుదలవుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.












