నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, చట్టపరమైన సహాయాన్ని అందించారు.
గ్రీవెన్స్ డే కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను పోలీసులకు నేరుగా తెలియజేయగలుగుతున్నారు. జిల్లా ఎస్పీ, బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడం, సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేయాలని ఎస్పీ హామీ ఇచ్చారు.












